Posts

Showing posts from May, 2023

ఆకురాలిన చప్పుడు ఆకాశవాణి సమీక్ష

Image
  ఆకాశవాణి విజయవాడలో గుమ్మా సాంబశివరావు గారి సమీక్ష కాలాన్ని బట్టి రచనా ప్రక్రియలు మారినట్లే కవితా స్వరూపం కూడా మారుతుంది. ఆధునిక కాలంలో కవిత్వం పలురూపాల్లో వెలువడినా వచన కవిత్వానీదే అగ్రస్థానం. ఒక దృశ్యం సాక్షాత్కరించినప్పుడో, ఒక సంఘటన జరిగినప్పుడో, ఒక భావం మదిలో మిగిలినప్పుడో కవి ఆలోచన అక్షరరూపాన్ని ధరిస్తుంది. ఆలోచనకు సృజనాత్మకమైన అక్షర స్వరూపమే కవిత్వం. కవికి స్పందించే హృదయం ఉండాలి. దానితోపాటు భావుకత ఉండాలి. భావుకతను వెల్లడించే సృజనాత్మక ప్రతిభ ఉండాలి. ఈ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకొన్న యువకవి శ్రీ వశిష్ఠ సోమేపల్లి. ఇతని కలం నుంచి వెలువడ్డ తాజా కవిత్వ సంపుటి "ఆకురాలిన చప్పుడు."ఇందులో 50 కి పైగా కవితలున్నాయి. ఈ కవితలు ఈ యువ కవికి గల విశిష్ట ప్రతిభకు ప్రతిబింబాలుగా ఉన్నాయని చెప్పటం సముచితం. శ్రీ వశిష్ఠ సోమేపల్లి, ప్రసిద్ధ కవి శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారి పుత్రుడు. తండ్రిగారి కవిత్వాన్ని చిన్నప్పటి నుంచి పరిశీలిస్తూ ఉండడం, తండ్రిగారి కవి మిత్రులతో పరిచయం ఏర్పడటం, తనకు రాయాలనే తపన ఉండటం అనే కారణాలతో కవిత్వాన్ని రచించిన వశిష్ఠ తన ప్రతిభనూ, సామాజిక పరిశీలననూ, విశిష్ట అభివ్యక...